News April 13, 2024

ఇక నెల రోజులే

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి నెల రోజులే సమయం ఉంది. వచ్చే నెల ఇదే రోజున పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29తో ఉపసంహరణ గడువు ముగియనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. పార్టీల అధినేతలు బస్సు యాత్రలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

Similar News

News November 16, 2024

ఝాన్సీ ఆస్పత్రి ప్రమాదం: నర్స్ అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే?

image

యూపీలోని ఝాన్సీ ఆస్పత్రిలో ఓ నర్సు అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే <<14624059>>అగ్ని ప్రమాదం జరిగిందని<<>> భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘ఆ సమయానికి నేను వార్డులోనే ఉన్నాను. ఆక్సిజన్ సిలిండర్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ఓ నర్సు అగ్గిపెట్టెను వెలిగించారు. దీంతో వెంటనే నిప్పు అంటుకుంది. నలుగురు పిల్లల్ని గుడ్డలో చుట్టి బయటికి తీసుకొచ్చేశాను. తర్వాత ఇతరుల సాయంతో మరింతమందిని కాపాడగలిగాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

నయన్ పోస్ట్‌పై త్వరలోనే స్పందించనున్న ధనుష్!

image

హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార <<14627063>>సంచలన పోస్ట్ <<>>నేపథ్యంలో ఆయన తరఫు లాయర్ స్పందించారు. హీరోయిన్ పోస్ట్‌కు త్వరలోనే ధనుష్ సమాధానం చెప్తారని పేర్కొన్నారు. కాగా నయనతారపై చేసిన డాక్యుమెంటరీ‌ ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై నయన్ తీవ్రంగా స్పందిస్తూ పోస్ట్ చేశారు.

News November 16, 2024

చిన్నాన్నతో అనుబంధం మరువలేనిది: లోకేశ్

image

AP: తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడి మృతితో మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం కళ్ల ముందే మెదలాడుతోందన్నారు. ‘ఇన్నాళ్లు ఆయన కంటికి కనిపించే ధైర్యం. కానీ ఇకపై చిరకాల జ్ఞాపకం. అంతులేని దుఖంలో ఉన్న పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలి. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.