News March 19, 2025
బడ్జెట్లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు

TG: మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘బడ్జెట్లో అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయి. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తున్నారు. బడ్జెట్లో మాత్రం రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు. మహిళలకు రూ.2,500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్లో పెట్టారు’ అని విమర్శించారు.
Similar News
News December 29, 2025
2029లోనూ మోదీ ప్రభుత్వమే: అమిత్ షా

ప్రజాసేవ, అభివృద్ధి మంత్రాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేవని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే ప్రతిసారి ఓడిపోతున్నాయని చెప్పారు. ‘2029లోనూ మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP సూత్రాలతో ప్రజలు కనెక్ట్ కావడమే ఇందుకు కారణం. అయోధ్య, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు.. అన్నింటినీ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. జనం మద్దతిచ్చే వాటిని వ్యతిరేకిస్తే ఓట్లు ఎలా పడతాయి’ అని ప్రశ్నించారు.
News December 29, 2025
రేపే వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం

ధనుర్మాసం ఎంతో శక్తిమంతమైనది. వైకుంఠ ఏకాదశి నాడు ఈ వైభవం రెట్టింపవుతుంది. ఈ పవిత్ర దినాన భక్తులు చేసే ఉపవాసం శారీరక, మానసిక శుద్ధిని ఇస్తుంది. రాత్రంతా హరినామ స్మరణతో చేసే జాగరణ అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తెల్లవారుజామునే పురుషోత్తముణ్ని దర్శించుకోవడం వల్ల జన్మ ధన్యమవుతుంది. భక్తిశ్రద్ధలతో విష్ణువును ఆరాధించే వారికి సకల పాపాలు తొలగి, చివరకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
News December 29, 2025
రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్లు

ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ <<18699122>>ప్రమాదం<<>>తో ఎలమంచిలి రైల్వే స్టేషన్లో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, తుని, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులు ప్రస్తుతం స్టేషన్లో ఉన్నారు.


