News November 30, 2024
సంపన్నులే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారు: రంగనాథ్

TG: హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపన్నులే ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని అన్నారు. ఆక్రమణకు గురైన స్థలాల్లో పేదల కంటే ఎక్కువగా ధనికులే ఉన్నారని ఆయన వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల లీడర్లు అందులో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రభుత్వ సహకారం ఉందని తెలిపారు.
Similar News
News November 11, 2025
షమీ అన్ని ఫార్మాట్లలో ఆడాలి: గంగూలీ

దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న భారత బౌలర్ షమీకి దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు. రంజీల్లో ప్రదర్శన చూస్తే ఆయన ఫిట్గా ఉన్నాడనే విషయం అర్థమవుతుందన్నారు. షమీ టీమ్ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడాలని దాదా ఆకాంక్షించారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ జట్టుకు ఎందుకు సెలక్ట్ అవట్లేదో అర్థం కావట్లేదన్నారు. ఈ సీజన్లో వెస్ట్ బెంగాల్ తరఫున 2 రంజీ మ్యాచుల్లో షమీ 15 వికెట్లు తీశారు.
News November 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 6

శంకర సువన కేసరీనందన|
తేజ ప్రతాప మహా జగవందన||
హనుమంతుడు సాక్షాత్తూ శివుని అంశ నుంచి జన్మించాడు. అలాగే కేసరి నందనుడు. ఆయన తేజస్సు, ప్రతాపం అపారం. అందుకే సమస్త జగత్తు ఆయనకు నమస్కరిస్తుంది. ఆయన దర్శనం, స్మరణ మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతాయి. ప్రతికూల పరిస్థితులలో భయం వీడేలా ఆయన తేజస్సు మనకు శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 11, 2025
నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..

TG: ఇవాళ <<18244091>>జూబ్లీహిల్స్<<>> అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉ.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJP మధ్య పోటీ నెలకొంది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి నవీన్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.


