News August 29, 2024
అప్పుడే సెస్ తొలగిస్తాం: అచ్చెన్నాయుడు

AP: రైతులు పండించిన పత్తి పంట మొత్తాన్ని CCI కొనుగోలు చేసేలా కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘పత్తి మొత్తం CCI కొంటే.. స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మార్కెట్ సెస్ తొలగిస్తాం. దేశ వ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్‌లో 7% ఉన్న ఏపీలో 50% పత్తి దిగుబడి, కొనుగోళ్లు తగ్గడం ఆవేదనకు గురిచేస్తోంది. రెండింతల దిగుబడి వచ్చే రకాలను అందుబాటులో ఉంచాలి’ అని మంత్రి వెల్లడించారు.
Similar News
News December 25, 2025
ఇంటి వాస్తు ఆ ఇంట్లో ఎవరున్నా వర్తిస్తుందా?

ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వేర్వేరు కుటుంబాలకు ఒకే రకమైన ఫలితాలు ఉండకపోవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇంటి వాస్తు బాగున్నా, అదృష్టం అనేది ఆ వ్యక్తి పేరుబలం, జన్మరాశి, సింహాద్వార అనుకూలతపై ఆధారపడి ఉంటుందన్నారు. ‘ఇంటి గదులను శాస్త్రోక్తంగా వాడుకోవడం, పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడం, దైనందిన కార్యక్రమాలను నియమబద్ధంగా పాటించడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు వస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 25, 2025
CBN కేసుల ఉపసంహరణపై సుప్రీంకు వెళ్తాం: పొన్నవోలు

AP: స్కిల్ స్కామ్‌లో సాక్ష్యాలు లేవని సిట్‌తో చెప్పించి CBN HC కేసు ఉపసంహరింప చేయడం దారుణమని YCP నేత సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఆధారాలతోనే CBNను జైల్లో పెట్టారు. SCలో బాబు స్క్వాష్ పిటిషన్‌పై సాక్ష్యాలున్నాయని కౌంటర్ వేశారు. అది పెండింగ్ ఉండగా ఎలా ఉపసంహరిస్తారు. సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు. వీటిపై SCకి వెళ్తామని, ఉద్యోగుల్నీ దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.
News December 25, 2025
ఐదు భాషల్లో ‘ధురంధర్-2’ విడుదల

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీకి పార్ట్-2 రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 19న రానున్న ‘ధురంధర్-2’ను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ పేర్కొంది. కాగా ధురంధర్ 20 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.640.20 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని తెలిపింది.


