News November 28, 2024
‘ప్రత్యేక హోదా’పై మౌఖిక హామీ మాత్రమే ఇచ్చాం: కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాతపూర్వక హామీ ఇవ్వలేదని, మౌఖికంగా మాత్రమే చెప్పామని కేంద్రం హైకోర్టుకు నివేదించింది. దీంతో ఈ విషయంలో తామెలా జోక్యం చేసుకుంటామని పిటిషనర్ కేఏ పాల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది ప్రభుత్వాల పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. ఏపీకి హోదా ఇవ్వకుంటే ఎలా నష్టం జరుగుతుందో తెలియజేయాలని పాల్‌ను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది.
Similar News
News November 28, 2024
6 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో NIA దాడులు
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో NIA నేడు 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా సోదాలు ఆరంభించింది. ఇందుకు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంది. విదేశీ సిండికేటుతో ఇక్కడి ముఠాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తోంది. బాలకార్మికులు, నిరుపేదలే టార్గెట్‌గా వ్యాపారం చేస్తున్నట్టు అనుమానిస్తోంది. ఏయే రాష్ట్రాల్లో దాడులు చేపట్టారో తెలియాల్సి ఉంది.
News November 28, 2024
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం: సీఎం
TG: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని CM రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారన్నారు.
News November 28, 2024
డే నైట్ టెస్టుల్లో ‘పింక్ బాల్’ ఎందుకంటే?
క్రికెట్లో సంస్కరణల్లో భాగంగా డేనైట్ టెస్టులను ICC 2015లో ప్రారంభించింది. సాధారణ టెస్టులు రెడ్ బాల్‌తో జరుగుతుండగా, డేనైట్ ఫార్మాట్‌ను పింక్ బాల్‌తో నిర్వహిస్తున్నారు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయడం వల్ల రెడ్ బాల్ ఫ్లడ్ లైట్ల వెలుగులో సరిగ్గా కనిపించదు. అందుకే పింక్ బాల్‌ను వాడుతుంటారు. టెస్టు క్రికెటర్ల డ్రెస్సులు తెల్లగా ఉన్నందున వైట్ బాల్‌ను ఉపయోగించరు. 9 ఏళ్లలో 22 డే నైట్ టెస్టులు జరిగాయి.