News March 9, 2025

ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

image

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు CM చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ 11న స్వామి వారి కళ్యాణం సందర్భంగా సీఎం ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 26, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేట్ రూ.870 ఎగబాకి రూ.1,27,910కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,17,250గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.2వేలు పెరిగి రూ.1,76,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News November 26, 2025

ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

image

ఆకుకూరల్లో చీడపీడలను తట్టుకొని, తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
☛ తోటకూర: RNA-1, అర్కా సుగుణ, అర్కా అరుణిమ ఇవి ఎరుపు రకాలు. VARNA(VRA-I)
☛ పాలకూర: ఆల్ గ్రీన్, పూస జ్యోతి, అర్క అనుపమ, పూస పాలక్, జాబ్నర్ గ్రీన్
☛ గోంగూర: ANGRAU-12, ఎర్ర గోంగూర రకాలు: AMV-4, AMV-5, AMV-7
☛ మెంతికూర: పూస ఎర్లి బంచింగ, లామ్ సెలక్షన్-1, లామ్ మెంతి-2, లామ్ సోనాలి.

News November 26, 2025

సౌతాఫ్రికాతో టెస్ట్.. భారత్ 4 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో IND ఓటమి దిశగా పయనిస్తోంది. 27/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన IND మరో 2 వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మన్ కుల్దీప్(5) బౌల్డ్ కాగా, ఆ తర్వాత వచ్చిన జురెల్(2) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు సాయి సుదర్శన్ కూడా ఔట్ కాగా నోబాల్ కావడంతో బతికిపోయాడు.