News November 20, 2025

Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

image

‘ఆపరేషన్ సిందూర్‌’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.

Similar News

News April 15, 2026

ఇంటర్ రిజల్ట్స్.. 6, 10వ స్థానంలో ప.గో. జిల్లా

image

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు<<19653702>> సత్తా చాటారు<<>>. ఫస్ట్ ఇయర్‌లో 16,701 మందికి 12,775 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,557 మంది పరీక్షలు రాయగా 12,414 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో ప.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ రిజల్ట్స్ .. బాపట్ల జిల్లా అంతంత మాత్రమే..!

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో <<19653702>>బాపట్ల జిల్లా నుంచి 8,831 మంది పరీక్ష రాయగా<<>> 6,361మంది పాసయ్యారు. 72 % పాస్ మార్కులతో జిల్లా 17 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 8,358 మంది పరీక్షలు రాయగా 6,252 మంది పాసయ్యారు. 75% పాస్ మార్కులతో బాపట్ల జిల్లా 21 వ ప్లేస్ దక్కించుకుంది.

News April 15, 2026

TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్

image

AP: టీడీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి లోకేశ్‌కు పార్టీలో ప్రమోషన్ దక్కింది. జాతీయస్థాయిలో ఆయన సేవలను వినియోగించుకోవాలని పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబు నిర్ణయించారు. లోకేశ్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతోపాటు కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.