News September 26, 2024
ఓపెన్ ఏఐ CTO రాజీనామా

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO) మీరా మురాటి తన పదవికి రాజీనామా చేశారు. ఆరున్నరేళ్లుగా పనిచేస్తున్న కంపెనీని వీడటం కఠినమైనదని ఆమె అన్నారు. జీవితాన్ని అన్వేషించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మన్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 21, 2025
తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.
News November 21, 2025
మరో తుఫాను ‘సెన్యార్’!

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
News November 21, 2025
కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.


