News January 3, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్

image

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 9 నుంచి 22 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.25 ఫైన్‌తో ఈ నెల 23 నుంచి 29 వరకు, రూ.50 లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఆ తర్వాత తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు కట్టుకోవచ్చు.

Similar News

News January 5, 2025

మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే: వెంకయ్యనాయుడు

image

TG: ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. HICCలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వేష, భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కోపంలోనూ ఎదుటివారి మంచిని కోరుకోవడం మన సంప్రదాయం. మీ పిల్లలు చల్లగుండ.. మీ ఇల్లు బంగారంగాను అని తిట్టుకునేవారు. మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే’ అని పేర్కొన్నారు.

News January 5, 2025

కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

TGలో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచి జారీ చేయనుంది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్సుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, గత విధానాలనే యథాతథంగా కొనసాగించే ఛాన్సుంది. గ్రామసభలు, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే వచ్చిన 12 లక్షల దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంది.

News January 5, 2025

HYDలో ఏపీ మంత్రి సెటిల్‌మెంట్లు?

image

ఏపీలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఓ నాయకుడు HYDలో జోరుగా సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యవహారాలు హద్దుమీరుతున్నాయని AP ప్రభుత్వాన్ని TG సర్కార్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. TG భూవ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్న ఆయన్ను అదుపు చేయాలని సీఎం CBNకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన వారంలో 3 రోజులు HYDలోనే ఉంటూ పంచాయతీలు, పార్టీలతో బిజీగా ఉంటున్నారని సమాచారం.