News December 31, 2025
OpenAI ఉద్యోగుల సగటు వేతనం ₹13.4 కోట్లు!

టెక్ స్టార్టప్ చరిత్రలోనే OpenAI సరికొత్త రికార్డు సృష్టించింది. తన ఉద్యోగులకు ఒక్కొక్కరికీ సగటున ఏడాదికి $1.5 మిలియన్ల (సుమారు ₹13.48 కోట్లు) విలువైన స్టాక్ ఆధారిత జీతాలు ఇస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు IPOకి వెళ్లేముందు ఇచ్చిన దానికంటే ఇది 7 రెట్లు ఎక్కువ. AI రంగంలో టాలెంట్ కోసం పోటీ పెరగడంతో మెటా వంటి కంపెనీల నుంచి తమ వారిని కాపాడుకోవడానికి OpenAI ఈ భారీ ప్యాకేజీలు ఇస్తోంది.
Similar News
News December 31, 2025
ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు: ఎంపీ భరత్

AP: వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఖండించారు. ఓ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఉంటూ ఎమ్మెల్యే పదవికి తాను జస్టిస్ చేయలేనన్నారు. ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ భరత్ భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ ఎంపీ స్థానానికి బరిలో నిలిచేందుకు సిద్ధమని MLA గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
News December 31, 2025
ఉద్యోగుల కోసం రూ.713 కోట్లు విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. డిసెంబర్‌కు సంబంధించి రూ.713 కోట్లు విడుదల చేస్తూ Dy.CM బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ.700 కోట్లు చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు, ఆగస్టు నుంచి ప్రతినెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది.
News December 31, 2025
ఇన్సెంటివ్స్ పెంచిన స్విగ్గీ, జొమాటో

డెలివరీ పార్ట్‌నర్స్ స్ట్రైక్‌తో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. డెలివరీలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు జొమాటో, స్విగ్గీ పార్ట్‌నర్స్‌కు మెసేజెస్ పంపాయి. డెలివరీకి ₹120-150తో ఇవాళ ₹3000 వరకు సంపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అటు పికప్ రిజెక్షన్, క్యాన్సిలేషన్స్ తదితరాలపై పెనాల్టీలూ ఉండవు. స్విగ్గీ అయితే నేడు, రేపు ₹10k వరకు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తోంది.


