News December 28, 2025

OpenAI సూపర్ ఆఫర్.. రూ.4.6 కోట్ల జీతం

image

OpenAI భారీ జీతంతో ఓ జాబ్ ఆఫర్ ప్రకటించింది. ‘హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్’ అనే కీలక రోల్‌కు ఏటా 5.55 లక్షల డాలర్ల (సుమారు రూ.4.6 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ CEO సామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు. దీనికి సెలక్ట్ అయితే కొత్త AI మోడల్స్‌ వల్ల కలిగే సైబర్, భద్రతా ముప్పులను ముందే అంచనా వేసి నివారణ చర్యలను డిజైన్ చేయాలి. మెషిన్ లెర్నింగ్, AI సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

Similar News

News January 1, 2026

బత్తాయి జ్యూస్‌ లాభాలు తెలుసా?

image

నిత్యం మార్కెట్లో దొరికే బత్తాయి (మోసంబి) జ్యూస్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ జ్యూస్‌లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. డిటాక్సిఫికేషన్ ద్వారా శరీరం శుభ్రపడుతుంది. కళ్లకు, చర్మానికి, జుట్టుకు మేలు చేస్తూ వృద్ధాప్య ఛాయ‌లు తగ్గించడంలో సహాయపడుతుంది.

News January 1, 2026

మామిడి చెట్లకు పూత రావాలంటే ఏం చేయాలి?

image

ఈ సమయంలో మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. కొందరు రైతులు పూత రాకపోవడంతో ఆ మామిడి చెట్లకు ఇప్పుడు నీరు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల చెట్లలో మళ్లీ కొత్త చిగుర్లు వచ్చి, పూత రాకుండా పోతుంది లేదా పూత ఆలస్యమవుతుంది. నేలలో బెట్ట పరిస్థితులు పూత రావడానికి చాలా అవసరం.

News January 1, 2026

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు: బాలకిష్టారెడ్డి

image

TG: కాలం చెల్లిన సిలబస్‌ను పక్కన పెట్టి, మార్కెట్‌కు అవసరమైన సబ్జెక్టులు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ‘విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేలా సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ పాఠ్యాంశాలను రూపొందించాం. సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునిక టెక్నాలజీతో లింక్ చేశాం. ఉపాధి దొరికే కోర్సులకే ప్రయారిటీ ఇస్తాం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచుతాం’ అని తెలిపారు.