News July 13, 2024

తార్కిక సామర్థ్యాలపై OpenAI ప్రాజెక్ట్

image

చాట్ జీపీటీ తయారీ సంస్థ OpenAI కొత్త తరహా ఆర్టిఫిషియల్ మోడల్స్‌పై పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టుకు Strawberry అని పేరు పెట్టింది. ఈ వివరాలను సంస్థ రహస్యంగా ఉంచింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం అత్యాధునిక తార్కిక సామర్థ్యాలపై పనిచేస్తున్నట్లు సమాచారం. కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా వాటిపై లోతైన విశ్లేషణలు చేసే లక్ష్యంతో AI మోడళ్లను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 3, 2025

VHTలో 2 మ్యాచులు ఆడనున్న కోహ్లీ!

image

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ కనీసం 2 మ్యాచులు ఆడే అవకాశం ఉందని క్రీడావర్గాలు తెలిపాయి. DEC 24న ఆంధ్ర, 26న గుజరాత్‌తో జరిగే మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నాయి. ఈ 2 మ్యాచ్‌లకూ బెంగళూరు వేదిక కానున్నట్లు వెల్లడించాయి. విరాట్ చివరిసారి 2010 ఫిబ్రవరిలో VHTలో ఆడారు. తాజా సీజన్‌లో మరోసారి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తారని ఇప్పటికే ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డ్ వెల్లడించింది.

News December 3, 2025

తులసి కోట వద్ద నిత్య దీపారాధన ఎందుకు చేయాలి?

image

తులసి కోట వద్ద నిత్యం దీపం వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా ఇంటి నిండా సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఈ దీపం మన పరిసరాలను శుద్ధి చేసి మనలో పాజిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుందని అంటున్నారు. ‘లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరిగే యోగం కూడా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.

News December 3, 2025

స్మృతి మంధాన పెళ్లి కొత్త డేట్ ఇదేనా?

image

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో తొలుత స్మృతి తండ్రి, ఆపై పలాశ్ ఆస్పత్రుల్లో చేరి డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా పెళ్లికి కొత్త డేట్ ఫిక్స్ అయిందని, DEC 7న వివాహం జరగనుందని SMలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి బ్రదర్ శ్రవణ్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది. కొత్త డేట్ గురించి మేము ప్రకటించలేదు. ప్రచారంలో ఉన్న డేట్ రూమర్ మాత్రమే’ అని చెప్పారు.