News May 23, 2024

నేడు కర్నూలులో APERC కార్యాలయం ప్రారంభం

image

రాష్ట్ర విభజన నుంచి HYDలోనే కొనసాగుతున్న APERC(ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) ప్రధాన కార్యాలయం APకి తరలిరానుంది. కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో 2 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఇవాళ అధికారులు ప్రారంభోత్సవం చేయనున్నారు. వారంలో కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అమరావతిలో కాకుండా కర్నూలులో ఆఫీస్ నెలకొల్పడంపై హైకోర్టులో విచారణ సాగుతోంది.

Similar News

News January 22, 2026

PM తర్వాత గంభీర్‌దే టఫ్ జాబ్: శశి థరూర్

image

నాగ్‌పూర్‌లో హెడ్ కోచ్ గంభీర్‌ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్‌తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.

News January 22, 2026

EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

image

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్‌లాండ్‌ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించిన గోల్డెన్ డోమ్‌పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.

News January 22, 2026

HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

image

స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌ను సీఎం రేవంత్ దావోస్‌లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్‌ను అధ్యయనం చేస్తామని తెలిపారు.