News November 25, 2024

APలో తొలి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభం

image

ఏజెన్సీల్లో డోలీ మోతలకు చెక్ పెట్టేలా AP ప్రభుత్వం రంగంలోకి దిగింది. మన్యం(D) సాలూరు(మ) కరడవలసలో తొలి కంటైనర్ ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజన, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చామన్నారు. ఆశా కార్యకర్త, బీపీ, షుగర్ సహా 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. చిన్నారులకు టీకాలు, పలు మెడికల్ టెస్టులు చేయించుకునే సౌకర్యం ఇక్కడ ఉందన్నారు.

Similar News

News November 25, 2024

ముంబై ఇండియన్స్‌లోకి మరో తెలుగు కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు కుర్రాడు కాకినాడకు చెందిన పెన్మత్స వెంకట సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే ఆయనను సొంతం చేసుకుంది. ఇప్పటికే ముంబై జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైజాగ్‌కు చెందిన అవినాశ్‌ను రూ.30 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే బైలపూడి యశ్వంత్, విజయ్ కుమార్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News November 25, 2024

Women Tax Payers: ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ

image

ఆదాయ ప‌న్ను చెల్లించే మ‌హిళ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కంటే తెలంగాణ‌లో అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఏపీ నుంచి 6.53 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ప‌న్ను చెల్లించారు. అదే తెలంగాణలో 8.55 ల‌క్ష‌ల మంది ప‌న్ను చెల్లించిన‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గ‌త ఐదేళ్ల గ‌ణాంకాలు తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే మ‌హిళ‌లు తెలంగాణ‌లో అధికంగా ఉన్న‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.

News November 25, 2024

ఇది కదా విజయం అంటే..!

image

లక్ష్య ఛేదనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న మాటలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించారు. ‘2004లో గోవాలో IFFIల ఈవెంట్ మేనేజ్మెంట్‌లో నాగ్ పనిచేశారు. సరిగ్గా 20 ఏళ్లకు IFFI పుస్తకంలో ఆయనకు ఓ పేజీ కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. కాగా ‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ‘కల్కి’తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్‌గా చరిత్రలోకెక్కారు.