News June 6, 2024
‘ఆపరేషన్ కాంబోడియా’.. 12 మంది ఏజెంట్ల అరెస్ట్: విశాఖ సీపీ
AP: ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామన్నారు. భారతీయులు లక్ష్యంగా ఏపీవాసులతో సైబర్ క్రైమ్‌లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు.
Similar News
News November 28, 2024
IPL: జితేశ్ శర్మ హైక్ 5,400 శాతం..!
ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును టీమ్ ఇండియా ప్లేయర్ జితేశ్ శర్మ అందుకున్నారు. వేలంలో ఆయన తన పాత ధర కంటే 5,400% ఎక్కువ పలికారు. 2024లో ఆయన రూ.20 లక్షలకే పంజాబ్ తరఫున ఆడారు. ఈ వేలంలో ఏకంగా రూ.11 కోట్లతో తన పంట పండించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో శాలరీ హైక్ సాధించిన ప్లేయర్ మరొకరు లేరు. వికెట్ కీపింగ్ నైపుణ్యం, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా మంచి పేరుండటంతో RCB అతడిని కొనేసింది.
News November 28, 2024
కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
News November 28, 2024
మా తదుపరి లక్ష్యం అదే: అజిత్ పవార్
గతంలో జాతీయ హోదా కలిగిన NCPని తిరిగి ఆ స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ చీఫ్ అజిత్ పవార్ పేర్కొన్నారు. కొత్త తరాన్ని ముందుకు తీసుకువస్తామని, అందులోనూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. Decలో పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. 3 స్టేట్స్‌లో రాష్ట్ర పార్టీగా ఉన్నామని, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు NCP MP ప్రఫుల్ పటేల్ తెలిపారు.