News January 22, 2025

అన్నలను కంగారు పెడుతున్న ‘ఆపరేషన్ కగార్’

image

బస్తర్‌లోని అబూజ్‌మఢ్ అడవుల్లో అన్నల ఆధిపత్యానికి గండిపడింది. ‘కగార్’ పేరుతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌కు మావోయిస్టుల కంచుకోట కకావికలం అయింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకొని నక్సల్స్‌పైకి పంపారు. వీరికి తోడు CRPF, కోబ్రా బలగాలతో డ్రోన్లను ఉపయోగించి నక్సల్స్ జాడ పసిగట్టి చుట్టుముట్టి దాడి చేస్తున్నారు. దీంతో ఏడాదిలో 42 ఎన్‌కౌంటర్లు జరగగా అగ్రనేతలు సహా 300 మంది నక్సల్స్ హతమయ్యారు.

Similar News

News December 31, 2025

ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్.. ₹80,915 కోట్లు కోల్పోయాడు!

image

ఓ బిలియనీర్‌ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఏకంగా ₹80,915 కోట్ల నష్టం కలిగించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించడమే ఇందుకు కారణం. టింకాఫ్ బ్యాంక్ ఫౌండర్ టింకోవ్ 2022లో రష్యాను విమర్శించడంతో క్రెమ్లిన్ తీవ్రంగా స్పందించింది. ఆయన వాటాను విక్రయించాలని, లేదంటే బ్యాంకును జాతీయం చేస్తామని హెచ్చరించింది. దీంతో టింకోవ్ తన 35%వాటాను అమ్మేశారు. కానీ వాస్తవ విలువలో 3% చెల్లించడంతో ₹80,915cr కోల్పోయారు.

News December 31, 2025

పెరుగుతున్న ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్

image

గతంలో పిల్లల పెంపకంలో పెద్దలు, వైద్యులు, పుస్తకాలపై ఆధారపడేవారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ వైరల్ అవుతోంది. మనకున్న సందేహాలు, సలహాలను టైప్ చేస్తే ఎన్నో వీడియోలు వస్తున్నాయి. విస్తృతస్థాయి పేరెంటింగ్‌ విధానాలు, చిన్న కుటుంబాల వారు సలహాల కోసం దీనిపై ఆధారపడుతున్నారు. అయితే ప్రొఫెషనల్, పర్సనలైజ్‌డ్‌ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌ సమానం కాదని నిపుణులు చెబుతున్నారు.

News December 31, 2025

అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం ఇదే: సీఎం

image

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న వారికి సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ‘కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ.. ఒక రోజు ముందుగానే పెన్షన్ సొమ్ము అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లపై రూ.50 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాం. ఇది మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తూ… అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.