News August 20, 2025
పాఠ్య పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’

NCERT కీలక నిర్ణయం తీసుకుంది. 3-12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది. ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు రిలీజ్ చేసింది. 3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ సాగా ఆఫ్ వాల్యూర్(ఒక శౌర్య గాథ)’, 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ(ఒక గౌరవం&ధైర్యసాహసాలు)’ టైటిళ్లతో పాఠ్యాంశాలను తీసుకువచ్చింది. పహల్గామ్ అటాక్ ఇందులో పొందుపర్చింది.
Similar News
News August 20, 2025
EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 20, 2025
ASIA CUP: ప్చ్.. శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో నెటిజన్లు BCCIపై ఫైర్ అవుతున్నారు. అయ్యర్‌ను BCCI రాజకీయాలకు బలి చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్, ఐపీఎల్‌లో 604 పరుగుల చేసిన అతడిని పట్టించుకోకపోవడం దారుణమని దుమ్మెత్తిపోస్తున్నారు. కావాలనే అతడిని తప్పించారని వాపోతున్నారు.
News August 20, 2025
కాకినాడ ఆర్మీ ర్యాలీలో తీవ్ర విషాదం

AP: కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశృతి జరిగింది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుడిని విజయనగరం జిల్లా శ్రీహరినాయుడుపేటకు చెందిన సాయికిరణ్(20)గా పోలీసులు గుర్తించారు. గమ్యానికి 100 మీటర్ల దూరంలో సాయి ఆయాసంతో పడిపోయాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ కాసేపటి తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు.