News February 24, 2025
ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

TG: SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి HYDకు చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.
Similar News
News February 24, 2025
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: గవర్నర్

AP: ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాలతో మేలు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. మెగా DSC దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం’ అని గవర్నర్ చెప్పారు.
News February 24, 2025
టన్నెల్ ఘటన.. ‘నీరో చక్రవర్తి’లా రేవంత్ వ్యవహారం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది ఆచూకీ తెలియని స్థితిలో MLC ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నిమగ్నమవ్వడం దిగజారుడు రాజకీయమేనని కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనపై సీఎంకే సీరియస్‌నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.
News February 24, 2025
గంటల్లో కొడుకు పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

TG: కొన్ని గంటల్లో కొడుకు పెళ్లి చూసి మురిసిపోవాల్సిన తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. RTC రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్‌కు సిరిసిల్ల(D)యువతితో ఆదివారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తె.జా 3గంటలకు ఆయన హార్ట్ అటాక్‌తో కుప్పకూలాడు. ఇటీవల కామారెడ్డిలో <<15537771>>పెళ్లి మండపంలోనే<<>> వధువు తండ్రి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.