News February 7, 2025
ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్టాపిక్గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.
Similar News
News February 7, 2025
పేదలకు రూ.40 వేల ఇంజెక్షన్ ఉచితం: టీడీపీ
AP: గుండెపోటుకు గురైన పేషంట్ ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే ‘టెనెక్టెప్లేస్-40’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ ట్వీట్ చేసింది. రూ.40 వేల నుంచి రూ.45 వేల విలువైన ఈ టీకాను పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉందని తెలిపింది.
News February 7, 2025
రేపే CCL ప్రారంభం.. తొలి మ్యాచ్ ఎవరికంటే?
సినీ, క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలు కానుంది. రేపు తెలుగు వారియర్స్కు, కర్ణాటక బుల్డోజర్స్కు మధ్య బెంగళూరులో సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రైనోస్ vs బెంగాల్ టైగర్స్ మ్యాచ్ జరగనుంది. కాగా 14, 15వ తేదీల్లో హైదరాబాద్లో నాలుగు మ్యాచులున్నాయి. రేపు జరిగే మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.
News February 7, 2025
ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం
TG: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఐదుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.