News October 14, 2024

కులగణనపై ఈనెల 24 నుంచి అభిప్రాయ సేకరణ

image

TG: కులగణనపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. కులగణన కార్యాచరణపై ఇవాళ తొలిసారి సమావేశమైంది. ప్రణాళిక శాఖతో కలిసి కులగణన చేయాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి, వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనుంది. వాటిని అధ్యయనం చేసిన అనంతరం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించనుంది.

Similar News

News October 14, 2024

ఎన్నిక‌ల కోస‌మే ట్రూడో ‘అనుమానిత’ స్టంట్‌

image

కెనడాలో ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జ‌ర్ హ‌త్య‌ను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కెన‌డాలో ఇటీవల జీవ‌న వ్య‌యాలు భారీగా పెరగడంతో స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ట్రూడో ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ప్రాబ‌ల్యం ఉన్న ఖ‌లిస్తానీ వేర్పాటువాదుల మ‌ద్ద‌తు కోసమే నిజ్జర్ హత్యను ట్రూడో రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.

News October 14, 2024

ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

image

నిజ్జర్ హత్య కేసులో కెన‌డా దుందుడుకు ప్ర‌య‌త్నాల‌పై భార‌త్ చ‌ర్య‌లకు ఉపక్రమించింది. ఆరుగురు కెన‌డా దౌత్య‌వేత‌ల‌ను బ‌హిష్క‌రించింది. భార‌త్‌లో కెన‌డా తాత్కాలిక హైక‌మిష‌న‌ర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ పాట్రిక్ హెబర్ట్ సహా నలుగురు కార్యదర్శులను బహిష్కరిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వీరంద‌ర్నీ అక్టోబ‌ర్ 19న రాత్రి 11.59 గంట‌ల‌లోపు భార‌త్ వీడి వెళ్లాల‌ని ఆదేశించింది.

News October 14, 2024

పాక్ ఘోర ఓటమి.. భారత్‌కు బిగ్ షాక్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో 54 రన్స్ తేడాతో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. దీంతో భారత్, పాక్ టోర్నీ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. 111 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కాగా గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌లో పాగా వేయగా తాజాగా న్యూజిలాండ్ బెర్తు ఖరారు చేసుకుంది.