News November 23, 2024
అవకాశం.. 72 గంటలే!

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. అయితే ఫలితాలు వచ్చిన 72 గంటల్లోనే గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 26తో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఈనేపథ్యంలోనే మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములు సైతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఫలితాలు BJP నేతృత్వంలోని మహాయుతికే అనుకూలంగా రావొచ్చని సర్వేలు చెప్పాయి.
Similar News
News November 13, 2025
17న ఎమ్మెల్యేల అనర్హత సహా అన్ని పిటిషన్లపై విచారణ

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నిటినీ సోమవారం (17వ తేదీ) విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోలేదంటూ BRS ఇటీవల స్పీకర్పై ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై నిర్ణయానికి మరో 2నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం అంతకు ముందే SCని కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం తాజాగా స్పష్టం చేసింది.
News November 13, 2025
BOB క్యాపిటల్లో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.bobcaps.in/
News November 13, 2025
నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <


