News August 24, 2025
ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లకు అవకాశం

TG: డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫేజ్-2 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే మార్చుకోవచ్చు. మరో కాలేజీలో అలాంటి అవకాశం ఉండదు.
Similar News
News August 24, 2025
రాష్ట్రంలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

TG: భద్రాద్రి(D)లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన బాలిక(17) ఈనెల 22న రాత్రి ములుగు(D) వాజేడు వెళ్లేందుకు చర్లలో ఆటో ఎక్కింది. ఒంటరిగా ఉన్న ఆమెకు ముగ్గురు ఆటో డ్రైవర్లు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం పాల్వంచలో వదిలేశారు. పోలీసులు బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
News August 24, 2025
ఆసియా కప్.. భారత జట్టుకు కొత్త స్పాన్సర్?

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ <<17477461>>చట్టంతో<<>> భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్ 11 వైదొలగడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే దీనిపై BCCI సెక్రటరీ సైకియా <<17485869>>స్పందిస్తూ<<>> కేంద్రం అనుమతి లేకపోతే స్పాన్సర్‌ను తొలగిస్తామని చెప్పారు. వచ్చే నెల 9 నుంచి ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో BCCI కొత్త స్పాన్సర్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలను త్వరలో బిడ్‌కు ఆహ్వానించనున్నట్లు సమాచారం.
News August 24, 2025
గగన్‌యాన్ మిషన్.. తొలి అడుగు విజయవంతం

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్(IADT-01) విజయవంతమైంది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా క్యాప్సుల్‌ను పారాచూట్ల సాయంతో సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసింది. ఈ పరీక్షను IAF, DRDO, నేవీ, కోస్ట్ గార్డ్‌తో కలిసి ఇస్రో చేపట్టింది. కాగా ఇండియా మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు గగన్‌యాన్ మిషన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.