News October 25, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: KTR

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు. ‘అన్ని సంస్థలను ఒకే కేటగిరీగా మార్చాలన్న ప్రతిపాదన సరైనది కాదు. ఛార్జీల పెంపుతో చిన్న పరిశ్రమలపై భారం పడుతుంది. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఎక్కడ?’ అని ప్రశ్నించారు.

Similar News

News October 25, 2024

రూ.లక్షన్నర కోట్ల కంపెనీకి ఓనర్.. అయినా..!

image

లక్షన్నర కోట్ల సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపే బిలియనీర్ ఆర్ త్యాగరాజన్ గురించి తెలుసా? శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించిన త్యాగరాజన్ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఏకంగా రూ.1.5లక్షల కోట్లు. దుబారా జీవితం అవసరం లేదని ఆయన చెబుతుంటారు. చిన్న ఇంట్లో జీవిస్తూ, రూ.6లక్షల విలువైన కారులో ప్రయాణిస్తుంటారు. ఆయన మొబైల్ వినియోగించేందుకు ఇష్టపడరు.

News October 25, 2024

ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ దాడి.. 28 మంది మృతి

image

ద‌క్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ జ‌రిపిన భీక‌ర దాడిలో 10 మంది చిన్నారులు స‌హా 28 మంది పాల‌స్తీనియ‌న్లు మృతి చెందారు. మ‌రో 40 మంది గాయప‌డ్డారు. ఒక నివాస సముదాయాన్ని ల‌క్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జ‌రిపిన దాడిలో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృతి చెందిన‌ట్టు ప్ర‌త్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ జ‌రిపిన తాజా వైమానిక దాడుల్లో ముగ్గురు జ‌ర్న‌లిస్టులు మృతి చెందారు.

News October 25, 2024

మాయదారి ‘మయోనైజ్’ మాయం?

image

షవర్మా, మండి బిర్యానీ వంటి ఆహారాల్లో వాడే మయోనైజ్ నిషేధానికి TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు GHMCకి ఫిర్యాదులు రావడంతో బ్యాన్‌కు అనుమతించాలని ప్రభుత్వానికి బల్దియా లేఖ రాసింది. దీన్ని పరిశీలిస్తున్న సర్కార్ రాష్ట్రమంతా బ్యాన్ చేయొచ్చని సమాచారం. గుడ్డు సొన, నూనె, నిమ్మరసం, ఉప్పుతో వండకుండా చేసే ఈ పదార్థంలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. మీరూ దీని బాధితులేనా?