News June 16, 2024
స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు పోటీ?

సార్వత్రిక ఎన్నికల్లో NDAకు గట్టి పోటీ ఇచ్చిన INDIA కూటమి గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. మరోవైపు స్పీకర్ పదవిపై NDA <<13417512>>మిత్రపక్షాలు<<>> కన్నేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 25, 2025
15 సంవత్సరాలు జరగని అభివృద్ధి నేను చేశాను: మంత్రి మండిపల్లి

మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 15 సంవత్సరాలు చేయని అభివృద్ధి తాను కేవలం 15 నెలలలోనే చేశానని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో రాయుడు కాలనీలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్ ద్వారా తాను విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.
News November 25, 2025
వరంగల్: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి షురూ..!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీల వారీగా గ్రామాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఒక పార్టీ నుంచి ఇద్దరి కన్నా ఎక్కువ అభ్యర్థులు ఉన్న చోట నాయకులు అందరితో మాట్లాడి ఒకే అభ్యర్థి ఉండేలా చర్చలు జరుపుతున్నారు.