News April 2, 2025

లాలూ కోరికను ప్రతిపక్షం తీర్చలేకపోయింది.. మేం తీరుస్తున్నాం: షా

image

వక్ఫ్ ఆస్తులు లూటీ కాకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన చట్టాలు రావాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో గుర్తుచేశారు. ‘2013లో అప్పటి యూపీఏ సర్కారు సవరణ బిల్లును ప్లాన్ చేస్తే లాలూ స్వాగతించారు. ‘వక్ఫ్ బోర్డులో సభ్యులు చాలా భూముల్ని అమ్మేశారు. సవరణను మేం సమర్థిస్తున్నాం’ అని అన్నారు. ఆయన కోరికను మీరు నెరవేర్చలేదు. మోదీ చేశారు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 3, 2025

ఈనెల 18న ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్

image

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

News April 3, 2025

రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు

image

AP: విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 35 ఎకరాల్లో 15.17 ఎకరాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఓ ప్రయోజనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని మిగతా వాటికోసం వినియోగిస్తే రద్దు చేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం స్టూడియోకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా కలెక్టర్‌ను ఆదేశించారు.

News April 3, 2025

BREAKING: గురుకుల CET ఫలితాలు విడుదల

image

TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం FEB నెల 23న నిర్వహించిన TG CET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!