News April 12, 2024

ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది: హరీశ్‌రావు

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన నాలుగు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. మరోవైపు ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని హరీశ్ అన్నారు. ఎన్నికలకు ముందు క్వింటాకు రూ.2500 ఇచ్చి వడ్లు కొంటామని రేవంత్ అన్నారని, కానీ.. జనగామలో రూ.1500 మాత్రమే ధర పలుకుతోందని పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

క్రియేటర్లకు మద్దతుగా విజయసాయి ట్వీట్

image

సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయని మాజీ MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55% ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ టాక్సీ’ తరహా సొంత ప్లాట్‌ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. గతంలో క్రియేటర్లకు <<19248675>>మద్దతుగా<<>> అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.

News March 3, 2026

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

image

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.

News March 3, 2026

ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

image

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.