News February 3, 2025

లోక్‌సభలో విపక్షాల నిరసనలు

image

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై లోక్‌సభలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నాయి. కుంభమేళాలో సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆందోళనకు దిగాయి. దీంతో సభ నడవాలని విపక్షాలు కోరుకోవట్లేదని స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News February 3, 2025

పుస్తకాలకు బదులు వ్యక్తుల కథలు తెలుసుకునే లైబ్రరీలు!

image

లైబ్రరీకి వెళ్లగానే ‘సైలెంట్ ప్లీజ్’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, డెన్మార్క్‌లోని లైబ్రరీలలో వివిధ రకాల ప్రజల కథలు మారుమోగుతుంటాయి. పుస్తకాలకు బదులు అక్కడున్న వ్యక్తులను తీసుకెళ్లి, వారి జీవిత కథను వినొచ్చు. ప్రతి వ్యక్తికి ‘నిరుద్యోగి’, ‘శరణార్థి’లాంటి శీర్షికలు ఉంటాయి. వీరి కథలను విని ఒక పుస్తకాన్ని దాని కవర్ చూసి అంచనా వేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటారు. దీనిని హ్యూమన్ లైబ్రరీ అంటారు.

News February 3, 2025

అభిషేక్ ఊచకోతకు బౌలర్లు చేతగానివాళ్లలా కనిపించారు: పీటర్సన్

image

నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. ‘పిచ్ బ్యాటింగ్‌కు బాగుంది కరెక్టే. కానీ అటువైపు ఇంగ్లండ్ బౌలర్లేం తక్కువవారు కాదు. అలాంటి ఆటగాళ్లు కూడా అతడి విధ్వంసాన్ని చేతగానివాళ్లలా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం అద్భుతమైన బౌలింగ్ వేశారు. అతడిని ఆడటం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

EAPCET షెడ్యూల్ ఖరారు

image

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.