News November 30, 2024

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేశ్

image

TG: ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు, పదవులుంటాయన్నారు.

Similar News

News November 30, 2024

నదీ జలాల్లో రాష్ట్ర వాటాలను దక్కించుకోవాలి: CM రేవంత్

image

TG: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర వాటాలను దక్కించుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. అందుకోసం అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల అధికారులు, న్యాయ నిపుణులకు సూచించారు. ఇవాళ CM రేవంత్, మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖపై సమీక్షించారు.

News November 30, 2024

మహారాష్ట్ర CM ఆ పార్టీ నుంచే: అజిత్ పవార్

image

మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు మాజీ Dy.CM అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చారు. BJP నుంచే సీఎంగా ప్రమాణం చేస్తారని చెప్పారు. శివసేన, NCPలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయన్నారు. ‘మహాయుతి’ నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో జరిపిన సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడం కొత్తేం కాదని, 1999లో నెల పట్టిందని ఆయన గుర్తుచేశారు. వారం రోజులుగా మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

News November 30, 2024

నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. FIR నమోదు

image

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు శరద్ కపూర్‌పై FIR నమోదైంది. ఓ ప్రాజెక్ట్‌ విషయమై ఈనెల 26న ఆయన తనను ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని 32 ఏళ్ల మహిళ ముంబైలోని ఖర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో శరద్ కపూర్‌పై BNS 4, 75, 79 సెక్షన్ల కింద FIR నమోదు చేసి, విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కాగా శరద్ కపూర్ జోష్, కార్గిల్ LOC, లక్ష్య తదితర చిత్రాల్లో నటించారు.