News December 25, 2024

ఆప్‌’సోపాల్: స్కీములే లేవంటూ షాకిచ్చిన సొంతశాఖ

image

ఎన్నికల షెడ్యూలు రాకముందే ఢిల్లీ రాజకీయాలు ముదురుపాకాన పడుతున్నాయి. మహిళలకు ₹2100/M, వయోవృద్ధులకు ఉచిత వైద్యం కల్పిస్తామని ఆప్ ప్రకటించింది. మళ్లీ అధికారం చేపట్టాకే ఇస్తామంటూ రిజిస్ట్రేషన్లను ఆరంభించింది. విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అవేవీ నిజం కావని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఆ స్కీములే లేవంటూ పేర్లు, పత్రాలూ ఎవరికీ ఇవ్వొద్దనడం వివాదానికి దారితీసింది.

Similar News

News October 23, 2025

మరో నాలుగైదు రోజులు వర్షాలు: APSDMA

image

AP: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, ఏలూరు, ప.గో., NTR, ఉమ్మడి తూ.గో., విశాఖ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

News October 23, 2025

ఈశాన్య మూలలో చెట్లు ఉండకూడదా?

image

గృహానికి ఈశాన్య దిశలో వృక్షాలు లేకపోవడమే ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈశాన్య కోణం నిర్మలంగా ఉండాలని, అప్పుడే సూర్య కిరణాల ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని అన్నారు. ‘ఈ మూలలో చెట్లు ఉంటే సూర్యరశ్మికి అడ్డంకి అవుతాయి. సాధారణంగా ఈ దిశలో బావి/బోరు ఉంటాయి. చెట్ల వేళ్లు నేలలోకి చొచ్చుకుపోతే జలం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆ దిశను శుభ్రంగా ఉంచాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>

News October 23, 2025

ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

image

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.