News June 8, 2024
అమెరికా క్రికెటర్ సౌరభ్‌పై ఒరాకిల్ స్పెషల్ ట్వీట్

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ‘సూపర్’ షాకిచ్చిన USA క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ హీరో అయ్యారు. దీంతో అతడి పేరు నెట్టింట మార్మోగుతోంది. తాజాగా సౌరభ్ పనిచేస్తున్న ఒరాకిల్ సంస్థ సైతం స్పందించింది. ‘అమెరికా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. మా ఇంజినీర్, క్రికెట్ స్టార్ సౌరభ్ ప్రదర్శనపై గర్వంగా ఉంది’ అని ఒరాకిల్ ట్వీట్ చేసింది. ముంబైకి చెందిన సౌరభ్ 2010లో భారత్ తరఫున U-19 వరల్డ్ కప్‌లో ఆడారు.
Similar News
News September 12, 2025
సంకల్పంతో ఏదైనా సాధించొచ్చు: చంద్రబాబు

AP: పెద్ద కలలు, బలమైన సంకల్పంతో రాష్ట్రం రూ.57 లక్షల కోట్ల GSDP సాధించగలదని చంద్రబాబు అన్నారు. తాను తొలిసారి ఉమ్మడి APకి CM అయినప్పుడు జీతాలు చెల్లించే పరిస్థితి ఉండేది కాదని Way2News కాన్‌క్లేవ్‌లో గుర్తుచేశారు. ‘అప్పుడు సంక్షేమ పథకాలపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా. సంస్కరణలు చేపట్టా. ప్రజలూ సహకరించడంతో 20ఏళ్లకు HYD అభివృద్ధి చెందింది. అదే సంకల్పంతో ఇప్పుడు ఏపీ ఎదగడం ఖాయం’ అని చెప్పారు.
News September 12, 2025
రాహుల్.. మీకు సిగ్గనిపించడం లేదా: KTR

TG: తాము కాంగ్రెస్‌లో చేరలేదని BRS ఫిరాయింపు MLAలు చెప్పడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ఫైరయ్యారు. ‘డియర్ రాహుల్‌గాంధీ.. ఈ ఫొటోను చూడండి. కాంగ్రెస్ కండువాలను, ఢిల్లీలో మిమ్మల్ని కలిసిన BRS ఫిరాయింపు MLAలను గుర్తుపట్టారా? ఇప్పుడు వీరు తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని అంటున్నారు. దీన్ని అంగీకరిస్తారా? ఇది ఓట్ చోరీ కాదా? మీకు సిగ్గు అనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు.
News September 12, 2025
2, 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: సీఎం

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘జగన్ ఐదేళ్లలో ఎన్ని కాలేజీలు కట్టారు? కట్టకపోయినా కట్టానని ప్రచారం చేసుకున్నారు. మేము PPP విధానం తెచ్చినా కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే రన్ అవుతాయి. ఓపీ ఫ్రీగా ఉంటుంది. రెండు, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఆపరేట్ అవుతాయి. ఓపెన్ కాంపిటీషన్‌లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఎక్కువగా ఉంటాయి’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.