News August 27, 2024
మార్కెట్లోకి ఓరల్ కలరా వ్యాక్సిన్

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ‘హిల్కాల్’ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8,24,479 కలరా కేసులు నమోదయ్యాయి. 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టేందుకు ఓరల్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ విడుదల చేసింది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


