News April 13, 2025

Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

image

ఈ శనివారం HYD‌ వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 18, 2025

ఎలమంచిలి: ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానంపై సమావేశం

image

ఎలమంచిలి ఎంపీపీ బి. గోవిందుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గత నెల 24న నలుగురు సభ్యులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశానికి నోటీసు ఇచ్చిన జనసేన ఎంపీటీసీలు బి. శివలక్ష్మి, నగిరెడ్డి అమ్మాజీ, రాజన శేషు, ఎస్. ఉమా హాజరయ్యారు. కొద్దిసేపట్లో ఈ విషయం తేలనుంది.

News October 18, 2025

ఖమ్మం: బందోబస్త్‌ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

image

బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీంచారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

News October 18, 2025

RTC బస్సులు స్టార్ట్ అయ్యాయ్!

image

తెలంగాణలో బంద్ ప్రభావం తగ్గడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో 2,600 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి మీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.