News April 13, 2025
Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

ఈ శనివారం HYD వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 23, 2025
ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: హరీశ్ రావు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు X ద్వారా వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వేడుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
News April 23, 2025
ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.
News April 23, 2025
NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కార్మికులు చిక్కుకొని నేటికీ 60 రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు చేపట్టిన సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 12 కంపెనీలకు చెందిన 700మంది సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ అందులో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ నేటికీ లభించలేదు. ఈనెల 24న సహాయక చర్యలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.