News April 13, 2025

Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

image

ఈ శనివారం HYD‌ వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 12, 2026

హైదరాబాద్‌లో నో-స్టోరీ జోన్స్

image

HYD ఫ్రెండ్స్ సర్కిల్‌లో కొత్త సోషల్ రూల్ సైలెంట్‌గా వ్యాపిస్తోంది. కొన్ని ప్రదేశాలను ‘నో-స్టోరీ జోన్స్’గా ప్రకటిస్తున్నారు. చెరువు పక్కన రాళ్లు, సగం పూర్తయిన మెట్లు, అస్పష్టమైన కాలనీ మైదానాలనే ఎంచుకుంటున్నారు. ఆ స్పాట్‌లో ఫోన్లను ఒకచోట బోర్లా పెడతారు. ఫొటో క్లిక్ చేసినా అది SMలోకి వెళ్లదు. జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటాయి. ఈ ఆఫ్-గ్రిడ్ పాకెట్స్ స్నేహాలను అల్గారిథమిక్ ఎక్స్‌పోజర్ నుంచి రక్షిస్తున్నాయి.

News February 12, 2026

HYDలో డెంగీ కేసులు.. అసలు నిజం ఇదే!

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ NCVBDC డేటా ప్రకారం TGలో 2021లో కేవలం 220గా ఉన్న అనుమానిత చికెన్ గున్యా కేసులు 2024 నాటికి 13,592కు చేరుకున్నాయి. GHMC జనవరి 2026లో డెంగీ కేసులు 30% తగ్గాయని ప్రకటించింది. ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన డేటా మాత్రమే. ఎక్కువ మంది ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లడం, IHIP పోర్టల్‌లో డేటా నమోదులో జాప్యం వల్ల అసలు సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

News February 12, 2026

మల్కాజిగిరి కార్పొరేషన్: తూర్పు కోటలో రియల్ ఎస్టేట్ జాతర!

image

తూర్పు సిటీకి ఇప్పుడు ‘అదృష్టం’ పట్టింది. ​తార్నాక హుడా కాంప్లెక్స్ కేంద్రంగా మల్కాజిగిరి కార్పొరేషన్ తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు దుబాయ్ రేంజ్ స్కై స్క్రాపర్లు కట్టేందుకు గవర్నమెంట్ రూట్ మ్యాప్ రెడీ చేసింది ప్రభుత్వం. ఆఫీసియల్ సమాచారం ప్రకారం, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు సెట్ చేసి పశ్చిమ నగరానికే సవాల్ విసరబోతున్నారు.