News September 4, 2025
‘సోనియాపై FIR నమోదుకు ఆదేశించండి’

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని వికాస్ త్రిపాఠి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె భారత సిటిజన్ షిప్ లేకుండానే ఓటు నమోదు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1982లో ఆమె ఓటును డిలీట్ చేసి 1983లో తిరిగి చేర్చారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా సోనియాకు భారత పౌరసత్వం 1983లో లభించింది.
Similar News
News January 30, 2026
ఇళ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాల పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉగాది నాటికి 10,178 ఇళ్లు నిర్దేశించిన లక్ష్యంతో పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 30, 2026
సదాశివపేటలో దంపతులిద్దరూ నామినేషన్

సదాశివపేట మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ తరపున 1వ వార్డు అభ్యర్థిగా పిల్లోడి విశ్వనాథం, 13వ వార్డు అభ్యర్థిగా ఆయన భార్య పిల్లోడి భవాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వార్డు ప్రజల ఆశీస్సులతో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని దంపతులు ధీమా వ్యక్తం చేశారు.
News January 30, 2026
శుభ సమయం (30-1-2026) శుక్రవారం

➤ తిథి: శుద్ధ ద్వాదశి మ.09.50 వరకు
➤ నక్షత్రం: ఆరుద్ర తె.2.58 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.34-8.47, ఉ.10.18-11.14, మ.1.51-మ.3.55 వరకు తిరిగి సా.4.51-సా.5.47
➤ రాహుకాలం: మ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-ఉ.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.08.48-ఉ.09.33, మ.12.33-మ.1.18
➤ వర్జ్యం: మ.12.20-మ.1.50
➤ అమృత ఘడియలు: సా.5.35-రా.7.05


