News November 6, 2024
వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం

AP: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు YCPకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపై YSR జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారించి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదులతో ఏప్రిల్‌లోనే ఆయనను ఈసీ సస్పెండ్ చేయగా, చర్యల్లో భాగంగా విచారణకు ప్రభుత్వం నిన్న ఆదేశాలిచ్చింది.
Similar News
News December 27, 2025
TGTET హాల్ టికెట్లు విడుదల

TGTET హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. TETకు అప్లై చేసుకున్నవారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సా.4.30గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/
News December 27, 2025
VHT: రోహిత్, కోహ్లీల శాలరీ ఎంతంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో వారికి ఎంత శాలరీ వస్తుందన్న చర్చ జరుగుతోంది. లిస్ట్-A మ్యాచ్‌లు 40కు మించి ఆడిన సీనియర్ కేటగిరీ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.60K ఇస్తారు. రిజర్వ్‌లో ఉంటే రూ.30K చెల్లిస్తారు. కోహ్లీ, రోహిత్ సీనియర్ కేటగిరీ ప్లేయర్లే కాబట్టి రూ.60K చెల్లిస్తారు. IPLతో పోలిస్తే చాలా తక్కువే అయినా దేశవాళీ క్రికెట్‌లో ఇది మంచి ఫీజు అనే చెప్పుకోవచ్చు.
News December 27, 2025
యూరియా కష్టాలు.. చిన్న ఫోన్లలో యాప్ ఎలా?

తెలంగాణలో దాదాపు 60% రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా కష్టాలు తప్పడం లేదు. వారి చిన్న ఫోన్ నంబర్లకే ఆధార్, భూముల వివరాలు లింకై ఉన్నాయి. ఫోన్ మార్చితే పథకాలు రద్దవుతాయని భయపడుతున్నారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ కొని యూరియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


