News April 4, 2025

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

image

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్‌లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Similar News

News April 10, 2025

నేడు తోబుట్టువుల దినోత్సవం.. మీకున్నారా?

image

సంతోషం, బాధల్లో కుటుంబం ఒక్కటే తోడుంటుంది. ముఖ్యంగా తోబుట్టువులు మనకు అండగా నిలుస్తుంటారు. వారితో మనకుండే అనుభూతులు వెలకట్టలేనివి. ఏజ్ గ్యాప్ తక్కువగా ఉండటంతో వారి బట్టలు వేసుకోవడం, వారి పుస్తకాలను వాడుకోవడం, ఎవరి దగ్గర డబ్బులున్నా అంతా పంచుకోవడం వంటి జ్ఞాపకాలు మరువలేనివి. కానీ అప్పటి బంధాలు ఇప్పుడు కరువయ్యాయి. ఈర్ష్య పెరిగిపోయి ఒకరికొకరు సాయం చేసుకోవట్లేదు. ఇకనైన కలిసి ఉండేందుకు ప్రయత్నించండి.

News April 10, 2025

భారత్‌కు రాణా.. స్పందించిన పాక్

image

ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా భారత్‌కు తీసుకురావడంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ‘అతడు కెనడియన్ పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి రాణా తన పాక్ డాక్యుమెంట్ల రెన్యూవల్‌కు దరఖాస్తు చేయలేదు. అతడి విషయంలో తగిన సమయంలో మళ్లీ స్పందిస్తాం’ అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా ముంబై తాజ్ హోటల్‌లో ఉగ్రదాడిలో 166 మంది మరణించారు.

News April 10, 2025

ఎల్లుండి వైన్ షాపులు బంద్

image

TG: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ నెల 12వ తేదీన వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసి ఉంచాలని HYD సీపీ ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!