News August 7, 2025

మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఆదేశం

image

AP: 2024లో నంద్యాల SPగా పని చేసిన మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నంద్యాల YCP అభ్యర్థి శిల్పా రవిని హీరో అల్లుఅర్జున్ కలిసిన సమయంలో భారీ ర్యాలీకి అనుమతించారని, అదే రోజు చంద్రబాబు పర్యటన ఉండగా వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారని ఆయనపై అభియోగాలున్నాయి. ఇతర ఆరోపణలపైనా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణాధికారిగా CS నియమించారు.

Similar News

News August 8, 2025

సీనియర్లకు కలిసిరాని రీఎంట్రీ!

image

సెకండ్ ఇన్నింగ్స్‌తో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్లు అన్షు, లయ, జెనీలియాలకు నిరాశే మిగిలింది. అప్పట్లో కుర్రకారు మనసులు దోచిన అన్షు ‘మజాకా’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ లయ రీఎంట్రీ ఇచ్చిన ‘తమ్ముడు’ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ‘జూనియర్’ మూవీతో సౌత్‌లో అదృష్టం పరీక్షించుకుందామనుకున్న అల్లరి నటి జెనీలియాకు భంగపాటే ఎదురైంది.

News August 8, 2025

రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు

image

TG: భారీ వర్షాలతో HYD కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడం, ట్రాఫిక్‌కు అంతరాయం, విద్యుత్‌ సమస్యలపై ఇది సేవలందిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇబ్బందులుంటే 040-2302813/74166 87878 నంబర్లను సంప్రదించాలంది. మరోవైపు, నగరంలో రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేసింది. అధికారులందరూ అందుబాటులో ఉండాలని, హైడ్రా, GHMC, ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయాలని ఆదేశించింది.

News August 7, 2025

ఆస్పత్రి బెడ్‌పై టీమ్ ఇండియా ప్లేయర్ నితీశ్

image

టీమ్ ఇండియా ప్లేయర్ నితీశ్ రెడ్డికి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను నితీశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘స్పీడీ రికవరీ’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు నితీశ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా నితీశ్ మోకాలికి గాయమైంది. దీంతో ఆ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.