News May 22, 2024

కాళేశ్వరంపై అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం

image

TG: కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు అన్ని వివరాలు ఈ నెల 25లోగా ఇవ్వాలని ఇంజినీర్లను ఇరిగేషన్ శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం, మూడింటికీ ఒకే డిజైన్లు అమలు చేశారా? పనులకు ముందు అధ్యయనం, పని కాకుండానే కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్ ఇవ్వడం, నిర్మాణం, నాణ్యత తనిఖీ సహా ఏ ఒక్క అంశాన్ని దాచొద్దని స్పష్టం చేసింది.

Similar News

News October 31, 2025

ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్

image

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్‌మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.

News October 31, 2025

ఆ హక్కు బీఆర్ఎస్‌కు లేదు: రేవంత్

image

TG: బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తే వాతలు పెట్టాలని అన్నారు.

News October 31, 2025

బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

image

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.