News March 13, 2025
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.
Similar News
News March 13, 2025
ఉద్యోగులకు గుడ్ న్యూస్?

AP: ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ గద్దె దిగే సమయానికి రూ.25వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో రూ.4-5 వేల కోట్ల వరకు చెల్లించాలని చూస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఈ చెల్లింపులకు ఉపయోగిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
News March 13, 2025
రేపు సాయంత్రం నుంచి జనసేన ఆవిర్భావ సభ

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ శుక్రవారం సా.3.30 గంటల నుంచి ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఆహారం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు చేపట్టామని చెప్పారు. సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలను సిద్ధం చేశామన్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు ఏర్పాటు చేశామని వివరించారు.
News March 13, 2025
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్

AP: ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.