News February 9, 2025

ఖైదీని వదిలేయాలంటూ రాష్ట్రపతి పేరిట ఆదేశాలు.. కానీ…

image

యూపీలోని సహరన్‌పూర్ జిల్లా జైల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని విడిచిపెట్టాలని ఆదేశిస్తూ ‘రాష్ట్రపతి కోర్టు’ పేరిట జైలు అధికారులకు లేఖ వచ్చింది. ఇదేం కోర్టు అంటూ వారు ఆరా తీయగా అసలు అలాంటి న్యాయస్థానమే లేదని తేలింది. దీంతో ఎవరో తప్పుడు పత్రాలతో ఆదేశాలు సృష్టించారని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Similar News

News November 3, 2025

వేప మందుల వాడకంలో మెళకువలు

image

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.

News November 3, 2025

పాపం దక్షిణాఫ్రికా

image

వైట్ బాల్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ కప్ గెలవాలనే కలకు మహిళల జట్టు కూడా అడుగుదూరంలోనే ఆగిపోయింది. ఫైనల్లో ఓటమితో ఆ జట్టుకు వరల్డ్ కప్ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ ఏడాది మెన్స్ జట్టు WTC విజేతగా నిలిచినా గత ఏడాది T20WC ఫైనల్లో ఓటమి, తాజాగా WWC ఫైనల్లో ఓటమి ఆ దేశ ఫ్యాన్స్‌ను మరోసారి నిరాశకు గురిచేశాయి.

News November 3, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు

image

<>మెదక్ <<>>ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 34 జూనియర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మెషినిస్ట్/టర్నర్/గ్రిండర్/ఎలక్ట్రీషియన్/వైండర్/మెకానిక్/ఎలక్ట్రికల్ మెకానిక్/ఫిట్టర్‌లో NAC/NTC ఉండాలి. 18- 30 మధ్య వయసు గల అభ్యర్థులు నవంబర్ 21వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://ddpdoo.gov.in/