News September 24, 2024

ఆర్థిక సాయం పెంచుతూ ఉత్తర్వులు

image

AP: వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11వేలకు బదులుగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. మొదటి ఫ్లోర్‌లో ఉన్నవారికి రూ.10 వేలు, దుకాణాలకు, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు అందించనున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.

Similar News

News January 12, 2026

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

image

వందేభారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలపై దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. కోల్‌కతా- గువాహటి మధ్య నడిచే ఈ ట్రైన్ బుకింగ్ ఛార్జీలను రైల్వేశాఖ వెల్లడించింది. దీని కనీస ఛార్జీ రూ.960గా నిర్ణయించింది. అంటే.. 400కి.మీలలోపు 3ACలో ప్రయాణించిన వారికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. గరిష్ఠంగా 3,500కి.మీల 1AC ప్రయాణానికి రూ.13,300 చెల్లించాల్సి ఉంటుంది. RACకి ఇందులో చోటులేదని, కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే అనుమతిస్తామని తెలిపింది.

News January 12, 2026

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం: CBN

image

AP: గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM CBN ప్రకటించారు. ‘ఇది పూర్తయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీపడలేదు. ఏటా 3వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. 2 తెలుగు రాష్ట్రాలూ ఈ జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. పోలవరంలో మిగిలే నీళ్లను TG కూడా వినియోగించుకోవచ్చు. నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం లేదు ’ అని CM తెలిపారు.

News January 12, 2026

ధర విషయంలో దీని ముందు బంగారం ‘జుజూబీ’!

image

బంగారం రేటు చూసి మనం షాక్ అవుతాం. కానీ కాలిఫోర్నియం (Cf-252) అనే మెటల్ ధర ముందు అది జుజూబీ! ఒక గ్రాము బంగారం ధర దాదాపు ₹14,000 ఉంటే.. ఒక గ్రాము Cf-252 ధర దాదాపు ₹243 కోట్లు. అంటే ఒక గ్రాము కాలిఫోర్నియంతో సుమారు 171 కిలోల బంగారం కొనొచ్చన్నమాట! ఇది సహజంగా దొరకదు. కేవలం న్యూక్లియర్ రియాక్టర్లలో కృత్రిమంగా తయారు చేస్తారు. క్యాన్సర్ చికిత్సలో, చమురు బావుల గుర్తింపులో దీని రేడియోధార్మికత చాలా కీలకం.