News May 19, 2024
రబీ పంట నష్టం గణనపై ఉత్తర్వులు
AP: ఈ నెల 24లోగా రబీ పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అధికారులను ఆదేశించారు. కర్నూలు, శ్రీ సత్యసాయి, OGL, నెల్లూరు జిల్లాలో 87 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో 33%పైగా దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలన్నారు. ఒక్కో రైతుకు అయిదెకరాలకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు RBKల్లో అభ్యంతరాల స్వీకరణ.. 31న తుది జాబితా ప్రకటిస్తారు.
Similar News
News December 23, 2024
భారత జట్టు అరుదైన ఘనత
క్రికెట్లో భారత మెన్స్, ఉమెన్స్ జట్లు అరుదైన ఘనత సాధించాయి. టీ20 ఫార్మాట్లో వరల్డ్ కప్, ఆసియా కప్ ప్రారంభించిన తొలి ఏడాదే 3 సార్లు ట్రోఫీ అందుకున్నాయి. 2007లో టీ20 మెన్స్ వరల్డ్ కప్, 2023లో అండర్-19 ఉమెన్స్ T20WC, ఈ ఏడాది U-19 ఉమెన్స్ ఆసియా కప్‌లను సొంతం చేసుకున్నాయి. నిన్న జరిగిన U-19 ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.
News December 23, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.
News December 23, 2024
ఆ ముగ్గురితో సినిమాలు చేయాలనుకున్నా కుదరలేదు: శంకర్
ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ కథాంశంతో గేమ్ ఛేంజర్ రూపొందించినట్లు డైరెక్టర్ శంకర్ చెప్పారు. రామ్ చరణ్ నటన సెటిల్డ్‌గా ఉందని, కాలేజీ లుక్‌లో ఫైర్ ఉంటుందని డల్లాస్ ఈవెంట్లో తెలిపారు. తెలుగులో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌తో సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదన్నారు. చెర్రీతో మూవీ చేయాలని రాసిపెట్టి ఉందని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.