News May 30, 2024

మంత్రుల పేషీలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు

image

AP: జూన్ 3న సచివాలయంలోని మంత్రుల పేషీలు, ఛాంబర్లను ఖాళీ చేయించి, స్వాధీనం చేసుకోవాలని అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి బయటికి వెళ్లకుండా చూడాలని సూచించింది. తమ అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తరలించొద్దని స్పష్టం చేసింది. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

Similar News

News April 10, 2026

మళ్లీ వర్షం.. మ్యాచ్ మరింత ఆలస్యం

image

గువాహటి స్టేడియం వద్ద మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. పిచ్‌ను సిబ్బంది కవర్లతో కప్పేశారు. దీంతో RCB-RR మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

News April 10, 2026

ఇరాన్ పాకిస్థాన్‌కు వెళ్లడం డౌటే?

image

USతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పాక్ వేదికగా జరగాల్సిన ఈ చర్చలకు వెళ్లాలని ఓ వర్గం వాదిస్తుంటే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు చర్చల్లేవని మరో వర్గం అంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత కలహాల మధ్య ఇరాన్ ప్రతినిధుల బృందం ఇంకా ఇస్లామాబాద్ చేరుకోలేదని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇప్పటికే పాక్ పయనమయ్యారు.

News April 10, 2026

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

image

గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
జట్లు:
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పాటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, హేజల్‌వుడ్.
RR: జైస్వాల్, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, బర్గర్, ఆర్చర్, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేశ్.
* వైభవ్ IMPACT