News March 22, 2025
ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్కు చెందిన వారిగా గుర్తించారు.
Similar News
News December 8, 2025
BHPL: బోల్తా కొట్టిన ‘డమ్మీ’ వ్యూహం..!

భూపాలపల్లి జిల్లా గనపురం(ములుగు)మండలం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థులుగా భార్యభర్తలు బరిలో నిలవాల్సిన అనూహ్య పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బలపరిచిన అరుణ్ ప్రధాన అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. అతని భార్య గీతాంజలి డమ్మీ నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరణ చేసే సమయానికి గీతాంజలి అందుబాటులో లేకపోవడంతో ఆమెను కూడా తుది అభ్యర్థుల జాబితాలో చేర్చారు. దీంతో ఆ దంపతులిద్దరూ బరిలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News December 8, 2025
GNT: అమృత హెల్త్ కార్డులు అందజేసిన కలెక్టర్

ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎన్టీఆర్ వైద్యసేవ/అమృత హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అమృత హెల్త్ కార్డులను కలెక్టర్ చిన్నారులకు అందజేశారు. 39 మంది లబ్దిదారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చిన్నారులు వైద్యం పొందవచ్చన్నారు.
News December 8, 2025
సత్యసాయి: పల్స్ పోలియో గోడ పత్రికల విడుదల

డిసెంబర్ 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో ఆయన గోడ పత్రికలను విడుదల చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు తెలిపారు. 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పోలియో చుక్కలు తప్పనిసరిగా వెయ్యాలన్నారు.


