News March 24, 2025

ORR వరకు HMDA.. నిర్మాణ అనుమతుల బాధ్యతల బదిలీ!

image

మహానగరాభివృద్ధి సంస్థ HMDA పరిధిని RRR వరకు విస్తరించడంతో, విస్తీర్ణం 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ అనుమతుల ప్రక్రియలు ఇకపై డీటీసీపీ నుంచి హెచ్‌ఎండీఏకు బదిలీ అయ్యాయి. ఈ విస్తరణకు అనుగుణంగా ఇంజినీరింగ్, ప్లానింగ్ విభాగాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News January 7, 2026

పదో తరగతి పరీక్షలకు 72 కేంద్రాలు: డీఈవో

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 72 కేంద్రాల్లో 11,985 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో డా.కె.రామకృష్ణారావు తెలిపారు. అడ్డతీగల, రాజవొమ్మంగి పాఠశాలలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

News January 7, 2026

మిల్లర్లు సహకరించాలి: నెల్లూరు జేసీ

image

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

News January 7, 2026

డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

image

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.