News August 22, 2025

ORR వరకు మంచినీటికి డోకా లేకుండా ప్రణాళిక

image

రాబోయే 2 ఏళ్లలో 300 MGD గోదావరి జలాల అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మహానగర అవసరాలు తీరేలా వాటర్ నెట్వర్క్ రూపకల్పనకు జలమండలి కార్యాచరణ సిద్దం చేస్తోంది. ORR వరకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించడంతో పాటు, ఫోర్త్ సిటీ సహా ఇతర అవసరాలు తీర్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

Similar News

News August 22, 2025

SSS: నూతన బార్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 12 బార్ల ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మవరం 03, హిందూపూర్ 04, కదిరి 03, పెనుకొండ 01, మడకశిరలో 01 కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి గోవింద నాయక్ శుక్రవారం తెలిపారు. అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయించామన్నారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News August 22, 2025

లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

image

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.

News August 22, 2025

రాజంపేట: అయ్యో పాపం..!

image

ఆ 8మంది సరదాగా ఈతకు వెళ్లారు. సంతోషంగా గడుపుతున్న వేళ ప్రమాదం దరి చేరింది. కళ్ల ముందే స్నేహితులు నీటిలో మునిగిపోయారు. ఒకదాని తర్వాత మరొక మృతదేహాలను వెలికి తీసి ఒడ్డున వేస్తుంటే ఆపుకోలేని దుఃఖంతో కుమిలిపోయారు. ఎదిగొచ్చిన బిడ్డలు విగతజీవులుగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించారు. చెయ్యేరు నదిలో ముగ్గురు విద్యార్థుల <<17476364>>మృతికి <<>>సంబంధించిన విషాద గాథ ఇది.