News May 12, 2024
ఒర్రీ ఛార్జ్.. ఫొటోకు రూ.25 లక్షలు

ఒర్రీ అలియాస్ ఓర్హన్ అవత్రమని.. బాలీవుడ్ స్టార్ నటులు, హీరోయిన్లతో ఫొటోలు దిగుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే అతడేమీ సరదా కోసం ఫొటోలు దిగడం లేదండోయ్. అలా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారట. ఈ విషయాన్ని ఒర్రీ తాజాగా వెల్లడించారు. ‘నన్ను ఎవరైనా ఫొటో అడిగితే రూ.25 లక్షలు ఛార్జ్ చేస్తా. అదే టచ్ చేయమంటే ₹20 లక్షలు తీసుకుంటా. ఈ రెండూ రోజులో ఒకసారి మాత్రమే చేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో ఒర్రీ చెప్పారు.
Similar News
News April 7, 2026
ఆసియా బ్యాడ్మింటన్.. భారత్ గోల్డ్ సాధించేనా?

చైనా వేదికగా నేటి నుంచి ఈ నెల 12 వరకు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నుంచి మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్, శ్రీకాంత్, ఆయుష్, ఉమెన్స్ సింగిల్స్‌లో PV.సింధు, ఉన్నతి, తన్వి, మాళవిక బరిలో ఉన్నారు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల విభాగంలో గాయత్రి-ట్రీసా జాలీ పోటీ పడుతున్నారు. కాగా ఈ టోర్నీలో IND చివరగా 1965లో (దినేశ్ ఖన్నా) గోల్డ్ మెడల్ గెలిచింది.
News April 7, 2026
తగ్గుతున్న జననాలు.. స్కూళ్లలో చేరికపై ప్రభావం!

APలో జననాల రేటు నాలుగేళ్ల వ్యవధిలో 2.1 నుంచి 1.5 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం అన్ని స్కూళ్లు, కాలేజీల్లో చేరికలపై చూపుతోంది. రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం 2024-25లో విద్యార్థులు 83.44 లక్షలుగా ఉంటే 2025-26కు ఆ సంఖ్య 83,28,448కి తగ్గింది. ఇక 1-5 క్లాసుల్లో అడ్మిషన్లు 2023-24లో 34,27,904గా ఉంటే మరుసటి ఏడాదికి ఆ సంఖ్య 32,64,668కి తగ్గిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
News April 7, 2026
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేల వరకు, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్‌పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చని వివరించింది. APRకే ఇవి వర్తిస్తాయి.


