News May 2, 2024

నేటి నుంచి ఆర్‌సెట్ పరీక్షలు

image

AP: రాష్ట్రంలో ఉన్నత విద్యలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి కార్యదర్శి నాజీర్ అహ్మద్ ప్రకటించారు. నేటి నుంచి 5వ తేదీ వరకు ఆర్‌సెట్(రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), 6న ఐసెట్, 8న ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 23 వరకు ఏపీఈఏపీ సెట్ పరీక్షలు జరగనుండగా.. ఈ నెల 7 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Similar News

News December 25, 2024

విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు

image

బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.

News December 25, 2024

క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్

image

ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.

News December 25, 2024

రేపటి టెస్టులో రోహిత్ ఓపెనింగ్!

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. యశస్వీతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తోంది.