News July 8, 2025

9,718 ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్

image

AP: హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ నోడ్ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9,718.84 ఎకరాల్లో ఈ కారిడార్ ఉండనుండగా, 5,107 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం వాడుతారు. 1,212 ఎకరాలు వినోద సేవలు, 898 ఎకరాలు రోడ్ల కోసం, 510 ఎకరాలు గ్రీన్ జోన్, 474 రవాణా కోసం, 456 ఎకరాలు ప్రజా వినియోగాల కోసం, 336 ఎకరాలు నివాస ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు.

Similar News

News July 8, 2025

అంతర్జాతీయ అంపైర్ షిన్వారీ హఠాన్మరణం

image

ప్రముఖ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ (41) మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కన్నుమూసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా 1984లో షిన్వారీ అఫ్గానిస్థాన్‌లో జన్మించారు. తన కెరీర్‌లో 60 అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్/టీవీ అంపైర్‌గా పనిచేశారు. ఇందులో 34 వన్డేలు, 26 టీ20లు ఉన్నాయి.

News July 8, 2025

ప్రశాంతిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: అనిల్

image

AP: క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతల అక్రమ కేసులకు వైసీపీ నేతలు భయపడరని చెప్పారు. ‘ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ప్రసన్నను చంపేందుకే వేమిరెడ్డి అనుచరులు ఇంటికి వచ్చారు. ఆయన లేకపోవడంతో ఇంటిని ధ్వంసం చేశారు’ అని ఆయన ఆరోపించారు.

News July 8, 2025

కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలి: భట్టి

image

TG: సీఎం రేవంత్ సవాల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<16989439>>కేటీఆర్<<>> జీర్ణించుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలని ఫైరయ్యారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకుందామని, చర్చకు కేసీఆర్ రావాలని సవాల్ చేశారు. గోదావరి, కృష్ణ జలాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు.